4 August, 2026 | 1:51 AM

బెటాలియన్ అప్రోచ్ రోడ్డు ప్రారంభం

04-08-2026 12:00 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని, విధి నిర్వహణకు ప్రేరణను ఇస్తాయని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. వినోభానగర్లోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) మూడో బెటాలియన్లో నిర్వహించిన ఇంటర్నల్ స్పోరట్స్ మీట్ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెటాలియన్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని, హెచ్‌ఆర్‌ఏ సమస్య పరిష్కారానికి ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం హెచ్‌ఎండీఏ నిధులతో నాగన్పల్లి రోడ్డు నుంచి బెటాలియన్ గేటు వరకు నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును ఆయన ప్రారంభించారు. బెటాలియన్ పరిధిలో మరిన్ని వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.