హార్ట్ టూ హెల్ప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
04-08-2026 12:00 AM
నాగల్ గిద్ద, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : నాగల్గిద్ద మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 37 మంది విద్యార్థులకు హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ దాత మధుకర్ సహకారంతో ఒక్కో విద్యార్థికి ఏడు నోటుపుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు మూడే రవి నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. దాత మధుకర్కు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, సీనియర్ ఉపాధ్యాయులు మారుతి, కాశీరాం, శివకుమార్, రాజు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






