ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కాదూరి అచ్చయ్య
ఆలేరు,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీ కాదూరి అచ్చయ్య రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రచ్చర్ శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలని బిజెపి పార్టీ ప్రభుత్వానికి ముందస్తుగా సూచన చేసినప్పటికీ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం
విఫలమైందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 40 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇంకా 60 శాతం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీన రైతు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో కలిసి బస్సు యాత్ర నిర్వహించ బడుతుందన్నారు.
ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ఆలేరు నియోజకవర్గం ఇన్చార్జి చిరిగే శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గత నెల రోజుల క్రితం భువనగిరి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారని, అప్పటికే ప్రభుత్వనికి పలు సూచనలు చేశారని అమలు చేయలేదని విమర్శించారు.






