17 August, 2026 | 8:10 PM

కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర..

17-08-2026 07:06 PM

రేపటి ధర్నాను విజయవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే సండ్ర

కల్లూరు, ఆగస్టు 17 (విజయక్రాంతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కల్లూరులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సండ్ర మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా పథకాలపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సండ్రను బీఆర్‌ఎస్‌ నాయకులు జన్మదినం సందర్భంగా శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌, సొసైటీ మాజీ చైర్మన్‌ కాటమనేని వెంకటేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్‌ పెద్దబోయిన మల్లేశ్వరరావు, మాజీ జడ్పీటీసీలు లక్కినేని రఘు, మేకల కృష్ణ, కౌన్సిలర్‌, బీఆర్‌ఎస్‌ మండల యువజన అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ, దార్ల నరసింహారావు, సయ్యద్‌ ఇంతియాజ్‌, మహమ్మద్‌ ఇస్మాయిల్‌, గ్రామ సర్పంచ్‌ వేము కృష్ణ, కొరకొప్పు ప్రసాద్‌, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉబ్బన వెంకటరత్నం, రావుఫ్‌, కట్ట ఆర్లప్ప, కళ్యాణ్‌ కిషోర్‌, చారుగుండ్ల సందీప్‌, బొల్లం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ బాలు, అజ్మీర జములయ్య, జానీమియా, సీహెచ్‌ కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.