4 August, 2026 | 1:49 AM

అత్యాధునిక మెడికల్ ఐసీయూ

04-08-2026 12:53 AM

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్‌లో ప్రారంభం

మలక్‌పేట్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కేర్ ఆస్పత్రి మలక్‌పేట్‌లో అత్యాధునిక మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలా ప్రా రంభించారు. కార్యక్రమంలో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ సీఈఓ (ఇండియా II) డా. పవన్ కుమార్, రీజినల్ సీఈఓ నిలేష్ గుప్తా, కేర్ హాస్పిటల్స్, మలక్పేట్ సీఓఓ ప్రవీణ్ కుమార్ ఎడ్ల, అజంపురా కార్పొరేటర్ షేక్ మొహినుద్దీన్ అబ్రార్,

మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్‌వోడీ క్రిటికల్ కేర్ డాక్టర్ వజ్రపు రాజేంద్రతో పాటు సీనియర్ వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 24 గంటలపాటు పనిచేసే ఈ అత్యాధునిక ఎంఐసీయూలో ఆధునిక పేషెంట్ మానిటరింగ్ వ్యవస్థలు, లైఫ్ సపోర్ట్ పరికరాలు, శిక్షణ పొందిన క్రిటికల్ కేర్ నర్సులు, ఇంటెన్సివిస్టులు, స్పెషలిస్ట్ వైద్యులతో కూడిన బృందం అందుబాటులో ఉంటుందని ఆస్ప త్రి యాజమాన్యం తెలిపింది.