‘ప్రొస్టేటిక్’ సమస్యకు యశోదలో అత్యాధునిక శస్త్రచికిత్స
- తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి
విజయవంతంగా రెజమ్ వాటర్ వేపర్ థెరపీని నిర్వహించిన యశోద వైద్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి, ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యశోద ఆస్పత్రి వైద్యులు, సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రా ల్లోనే మొట్టమొదటి ‘రెజమ్ వాటర్ థెరపీ’ని విజయవంతంగా నిర్వహించారు. ప్రొస్టేటిక్ అబ్‌స్ట్రక్షన్ (బ్లాకేజీ) సమస్య వల్ల కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం, బాధపడుతున్న కామారెడ్డికి చెందిన ఎస్ అంజాగౌడ్ అనే 68 ఏళ్ల రైతుకు అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించినట్టు సీనియర్ యూరాలజిస్ట్,రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వీ సూర్యప్రకాశ్ గురువారం తెలిపారు.
శస్త్రచికిత్స నిర్వహణను ఇష్టపడని యువ రోగులకు ‘రెజమ్ వాటర్ థెరపీ’ ఉత్త మ ప్రత్యామ్నాయమని చెప్పారు. ఈ చికిత్స తర్వాత ఎలాంటి లైంగిక సంబంధిత సమస్యలు రావని, అన్ని రిస్క్ క్యాటగిరీల రోగు లకు నిర్వహించవచ్చని వివరించారు. మూత్రనాళంపై ఒత్తిడిని కలిగించే అదనపు ప్రొస్టేట్ కనజాలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి ‘రెజమ్ వాటర్ వేపర్ థెరపీ’ ఉత్తమ చికిత్స అని చెప్పారు. దీన్ని అనుకూలమైన డే ట్రీట్‌మెంట్‌గా రూపొందించినట్టు తెలిపారు. చికిత్స అనంతరం పేషంట్స్ అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చని వెల్లడించారు.






