21 August, 2026 | 10:24 PM

పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం

21-08-2026 09:36 PM

శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ దేవాలయంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటి ఆధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు బుడి అరుణ్ శర్మ, బుడి అణుదీప్ శర్మ, సుబ్బ అభేషేక్ శర్మ, బేదాంతు సచిన్ శర్మ, గణేష్ శర్మలు ఆలయంలో పూజలు ప్రారంభించారు. శుక్రవారం పాలపొరక, అమ్మవారి విగ్రహం శోభాయాత్ర నిర్వహించారు.

కాలనీలోని వాడ వాడలా భక్తులు, మహిళలు అమ్మవారి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బుడి అరుణ్ శర్మ మాట్లాడుతు ఈ నెల 22న పోచమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా శాంతి పాఠం, గణపతి పూజ, స్వస్తీ పుణ్యహావచనం, యాగశాల ప్రవేశం, కుంకుమార్చణలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 23న గణపతి పూజా, గర్తవాసం, బీజ న్యాసం, మండపార్చణ, మూల మంత్రం కన్యా లగ్నమున శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం పున:ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందన్నారు.అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించవచ్చన్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.