21 August, 2026 | 10:48 PM

ఫెస్టిసైడ్స్ వాడకంలో మనది మూడోస్థానం

14-06-2024 01:10 AM
  • మొదటిస్థానంలో పంజాబ్, రెండోస్థానంలో హర్యానా
  • ఫెర్టిలైజర్స్ వినియోగంలో రాష్ట్రం టాప్ 5
  • వరి సాగే పురుగుల మందు పిచికారీ పెరగడానికి కారణం
  • నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైసెన్స్ అధ్యయనంలో వెల్లడి
  • ఆందోళనలో వ్యవసాయ నిపుణులు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో పురుగు మందుల వాడకం భారీగా పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలోనే ఫెస్టిసైడ్స్ వాడకంలో రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచిన ట్టు ఆ సర్వే పేర్కొంది. స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైసెన్స్ చేసిన అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హెక్టారుకు 1,250 కిలోల పురుగుల మందును పిచారీ చేస్తూ దేశంలోనే పంజాబ్ మొదటిస్థానం లో ఉండగా, 1,100 కిలోల ఫెస్టిసైడ్స్‌ను వాడుతూ హర్యానా రెండోస్థానంలో, 900 కిలోలను వినియోగిస్తూ తెలంగాణ మూడోస్థానంలో నిలిచినట్టు పరిశోధనలో తేలింది. రాష్ట్రంలో రసాయనాల వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హెక్టారుకు 297 కిలోల ఎరువుల వినియోగం

ఎరువుల వాడకంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. ఫెర్టిలైజర్స్ వినియోగంలో తెలంగాణ ఐదోస్థానంలో నిలిచినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో హెక్టారుకు 297 కిలోల ఎరువులను వినిగిస్తున్నా రు. హర్యానాలో హెక్టారుకు 386 కిలోల ఎరువులను వినియోగిస్తూ మొదటిస్థానం ఉండగా, 317 కిలోలతో బీహార్ రెండోస్థానంలో, 315 కిలోలతో పంజాబ్, ఉత్తరప్ర దేశ్ మూడు, నాలుగుస్థానాల్లో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. 

సవాల్‌గా కలుపు మొక్కల నిర్వహణ

తెలంగాణ, హర్యానా, పంజాబ్‌లో వరి, పత్తిని అధికంగా సాగు చేస్తారు. అందువల్లే ఈ మూడు రాష్ట్రాల్లో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో కలుపు మొక్కల నిర్వ హణ అనేది రైతాంగానికి అతిపెద్ద సమస్యగా ఉందని నిపుణలు పేర్కొంటున్నారు. కలుపు మొక్కలను నియంత్రించేందుకు రైతులు క్రిమిసంహారక మందులను విపరీతంగా వాడుతున్నట్టు వెల్లడిస్తున్నారు. క్రిమి సంహారక మందులను విపరీతంగా వాడ టం వల్ల ఆహార ఉత్పత్తులు విషపూరితంగా మారుతాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. వాటిని తినడం అనేక ఆరోగ్య రుగ్మతలకు దారిస్తుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై పలు సంస్థలు, వ్యవసాయ నిపుణులు రైతులకు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుం డా పోతోంది.

ఏటికేడు ఫెస్టిసైడ్స్ వాడకం పెరుగుతోందే కానీ, తగ్గడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. క్రిమిసంహారక మందులను పెద్దమొత్తంలో వాడటం వల్ల భూమిలో చాలా మార్పులు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో కొన్ని పంటలకు ఉపయోగపడే సుక్ష్మజీవులు ఉంటాయని, రసాయనాల వల్ల అవి అంతరించిపోతాయని, దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల మనుగడపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

కోసిన 15 రోజుల వరకు వినియోగించొద్దు

అధిక మోతాదులో రసాయనాలతో పండించిన ఆహార ఉత్పత్తులను తిన డం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్యాన్సర్, గుండె, కిడ్నీ సం బంధిత రోగాలు వస్తాయి. రసాయనాలతో పండించిన పంటలను కోసిన దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు వాటిని ఉపయోగించకూడదు. కానీ రైతులకు తెలియకపోవడంతో కోసిన వెంటనే మార్కెట్లకు తరలిస్తున్నారు. దీని కారణంగా తల్లి పాలలో కూడా విషపూరిత రసాయనాలు బయటపడ్డా యి. అందువల్ల రైతులు మోతాదుకు మించి ఫెస్టిసైడ్స్‌ను వాడొద్దు. ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం వల్ల సమాజానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించిన వారు అవుతారు. మేము కూడా రసాయనాలను వాడొద్దని చెబుతున్నా రైతులు వినడం లేదు.

 శ్రీ కృష్ణ, హార్టికల్చర్ నిపుణులు, కేవీకే, రంగారెడ్డి