calender_icon.png 10 November, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఓఎస్‌ఎస్‌ను సందర్శించిన రాష్ట్ర పరిశీలనాధికారి జ్యోతి

10-11-2025 12:00:00 AM

బూర్గంపాడు, నవంబర్ 9,(విజయక్రాంతి):బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తు న్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్‌ఎస్) ను రాష్ట్ర పరిశీలినాధికారి జ్యోతి ఆదివారం సందర్శించారు. అనంతరం పుస్తకాల పంపిణీ, పాస్ మెమోలు, సంబంధిత రిజిస్టర్లు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు మధ్యలో మా నేసి తిరిగి పూర్తి చేయుటకు దూర విద్య దో హదపడుతుందని తెలిపారు. రెగ్యులర్ విద్య కు, దూరవిద్యకు ఒకే విలువ కలిగి ఉంటుందని అన్నారు. దూర విద్యలో పొందిన సర్టి ఫికెట్లు ఉన్నత విద్య చదువుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. మారుమూల ప్రాంతమైన బూర్గంపాడు లో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సత్క రించడం జరిగింది.