10-11-2025 12:00:00 AM
ఆళ్ళపల్లి /గుండాల, నవంబర్ 9( విజయక్రాంతి):విద్యుత్ ఘాతానికి గురై ఇల్లు దగ్గమైన ఘటన గుండాల మండల కేంద్రం లో ఆదివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన నాగేల్లి వెంకన్న ఇల్లు ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ,ఈ ప్రమాదంలో వడ్రంగి వృత్తికి సంబంధించిన మిషన్లు తదితర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది సర్వం కోల్పోయిన బాధితుడు నాగేల్లి వెంకన్న ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.