10-11-2025 12:00:00 AM
మణుగూరు,(విజయక్రాంతి) : కుమ్మరులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల కు మ్మర సంఘం నేతలు ఎమ్మెల్యేను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం మాట్లాడు తూ.. కుమ్మరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. కుమ్మరులకు ప్రభు త్వ పథకాలతో న్యాయం చేస్తామన్నారు. సం ఘం నాయకులు పలు సమస్యలను ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరికొండ వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు బాడిస శంకర్ రావు, నిదానపల్లి బాలకృష్ణ, నిమ్మనగోటి బిక్షపతి, కార్తీక్, గణేష్, గురుప్రసాదు తదితరులు పాల్గొన్నారు.