ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్
13-04-2026 02:28 PM
కూసుమంచి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం గుర్రాలపాడు గ్రామంలో ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు.. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యమే ప్రధానమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..పేద ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు..




