24 August, 2026 | 4:58 PM

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

24-06-2025 12:27 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ కాంతి లాల్‌పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజలు నిర్భయంగా, మధ్య వర్తిత్వం లేకుండా స్వచ్ఛందంగా పోలీ స్ సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. బాధితులు అందజేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అర్జీలపై సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్‌లో మాట్లాడి సమ స్య పరిష్కారానికి సూచనలు చేశారు.