7 July, 2026 | 6:23 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

24-06-2025 12:28 AM

ఎల్బీనగర్, జూన్ 23 : పెట్టుబడిదారుల కోసం కార్మికులను పాలకులు బలి చేస్తున్నారని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నా లుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ సరూర్ నగర్ సర్కిల్ కన్వీన ర్ మల్లెపాక వీరయ్య డిమాండ్ చేశారు. చైతన్యపురి డివిజన్ లోని మున్సిపల్ కార్మికుల తో సోమవారం సమావేశమయ్యారు. జులై 9న నిర్వహించనున్న దేశవాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె బుక్ లేటు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మల్లెపాక వీరయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కో డ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు రూ, 26వేలు ఇవ్వా లని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఆసంఘటిత కార్మికులు, వ్య వసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ కవరేజీ ఇవ్వాలని, ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులుపాల్గొన్నారు.