11 August, 2026 | 1:30 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం

24-06-2025 12:26 AM

భయాందోళనలో బోథ్ ప్రాంత వాసులు

బోథ్, జూన్ 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మళ్ళీ పెద్దపులి సమాచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. బోథ్ మండలంలోని అడెల్లి పొలిమేరలోని రఘునాథ్ పూర్ గ్రామ శివారులో ఇటీవల లేగ దూడ ను గుర్తు తెలియని జంతువు హతమార్చిన  విషయం తెలిసిందే. అయితే అందరూ  దూడ ను చిరుత పులి చంపిందని  అనుకున్నారు. అటవీ అధికారులు సైతం అదే విషయం తెలిపారు.

అయితే దూడ ను చంపిన జంతువు గురించి ఆరా తీయడానికి రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి ఆ ట్రాప్ కెమెరాలో పెద్దపులి సంచరించిన చిత్రాలు గుర్తించిన్నట్లు బోథ్ రేంజ్ ఎఫ్.ఆర్.వో ప్రణయ్ ధ్రువీకరించారు.

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుండి ఈ పెద్ద పులి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దింతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపరీలు జాగ్రత్త వహించాలని సూచించారు. పెద్దపులి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు.