పాలమూర్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి అడుగులు
ప్రతినెల తన వేతనం నుంచి రూ లక్ష ఇస్తానంటున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎప్పుడు ఎక్కడ లేని విధంగా భరోసానిచ్చేలా సంక్షేమ నిధి
పేద జర్నలిస్టుల కుటుంబాలకు అండగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ నిధి
మహబూబ్ నగర్, మార్చి 4 (విజయక్రాంతి): నిత్యం ప్రజా సమస్యలే తమ సమస్యగా భావించి పరితపించే జర్నలిస్టుల సమస్యలను మేము పరిష్కరిస్తామని వారే కరువు. సమస్యల పరిష్కారం అటువంటి ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్యాయం జరిగిన జర్నలిస్టులకు సమాచారం ఇస్తాం న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు స్పందిస్తారు అంటూ మొదటిగా గుర్తుకు వచ్చేది జర్నలిస్టులు. జర్నలిస్టులు పేద మధ్య తరగతి వారే అత్యధికం.
జర్నలిస్టుల కుటుంబాలతోపాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తను నమ్మిన సిద్ధాంతాలకు అక్షరాలు దిద్దుతూ ఎంతోమంది భవిష్యత్తుకు పునాదిగా మారిన జర్నలిస్టుల అభివృద్ధికి మాత్రం ఆదరణ తక్కువగానే ఉంటుంది. అలాంటి జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉంటూ పేద జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉండాలని సంకల్పంతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి నేను భరోసానిస్తానంటూ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
జర్నలిస్టుల సంక్షేమం అనేది ఏర్పాటు చేయండి ప్రతినెల తన వేతనం నుంచి రూ. 1 లక్ష అందిస్తానని చెప్పడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చినీయాశంగా మారింది. జర్నలిస్టులలో ఎవరికో ఒకరికి చదువులోనూ మరి ఇతర వైద్య వైద్యంలోనూ మరేదైనా అత్యవసర పరిస్థితుల్లోనూ సహకారాలు ఉంటే జర్నలిస్టుల సంక్షేమం ద్వారా తీర్మానం చేసి వారికి ఆ నిధి నుంచి అవసరమైన ఎంతో కొంత సహాయం చేసేందుకు ఈ నిధి ఎంతో ఉపయోగపడనున్నది.
-ఐక్యతతోనే సంక్షేమ నిధికి జీవం..
జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రతినెల లక్ష రూపాయలు అందిస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వెంటనే యూనియన్లకు అతీతంగా పాలమూరు జర్నలిస్టులు నియోజకవర్గ సంబంధించి ఒక సమావేశాన్ని ఇటీవల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించారు. దీంతో ఐక్యంగా కమిటీ ఏర్పాటు చేసుకుందామని సీనియర్ జర్నలిస్టులతోపాటు ప్రతి ఒక్కరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
- తన మార్కును చూపిస్తున్న ఎమ్మెల్యే..
ఇప్పటికే పాలమూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నూతన పథకాలు అమలు అవుతున్నాయి. నియోజకవర్గంలోని మహిళలు డెలివరీ అయిన వెంటనే తల్లి బిడ్డకు ఉపయోగపడే విధంగా యెన్నం అన్నా కిట్ అనే పేరు తో రూ 2 వేల విలువ గల కిట్టును ఎమ్మెల్యే అందజేస్తున్నా రు. విద్యార్థులకు డిజిటల్ పుస్తకాలతో పాటు నిరుద్యోగులకు మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా వివిధ రంగాలలో శిక్షణలు అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
దీంతోపాటు అభివృద్ధి పనులలోను తమదైన ముందస్తు ఆలోచ నలతో నూతన విధానాల కు శ్రీకారం చుట్టు అడుగులు వేయడంతో ఎమ్మెల్యే యెన్నం చేస్తున్న అభివృద్ధి పనులను నియో జకవర్గ ప్రజలు నిచితంగా గమనిస్తూ అభినందనలు తెలియజేస్తుండ్రు. ప్రతి సమస్యను ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చూపించే జర్నలిస్టు సమస్యకు కూడా పరిష్కారం చూపించాలని ఒక లక్ష్యంతో ముందుగా ఉండి నేనున్నా అంటూ ప్రతి నెలా రూ లక్ష నిధికి అందజేయడం మరింత ప్రత్యేకతను చాటిచెబుతుంది.




