13 April, 2026 | 7:51 AM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

01-02-2026 06:18 PM

ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. సెన్సెక్స్ దాదాపు 1547 పాయింట్లు పడిపోయి, 80,722.94 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 50, 495 పాయింట్లకు పైగా పతనమై 24,825.45 వద్ద ముగిసింది.