విజయోత్సవాలు మాని.. వంచన ఉత్సవాలను నిర్వహించుకోండి
-రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి
-ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
-నిర్మల్‌లో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్ నవంబర్ 5( విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించడం మాని వంచన ఉత్సవాలు నిర్వహిస్తే బాగుంటుందని బిజెపి నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తియారు. శుక్రవారం నిర్మల్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏమి ఒరగలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్విని యోగం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రం లో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్న ముఖ్యమంత్రి మంత్రులు విజయోత్సవాల పేరుతో సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని మరింత ఆర్థిక ఇబ్బందులు పెడుతు న్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే గతి లేదని ఆక్షేపించారు.
దేవుళ్ళ సాక్షిగా బాండ్ పేపర్ల సాక్షిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి మంత్రులు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారని దుయ్యపట్టారు. ప్రభుత్వ భూముల ను కొన్ని కార్పొరేటర్ సంస్థలకు విక్రయించి కమిషన్ల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హిట్ పాలసీ వెనుక లక్షల కోట్ల కుంభకోణం ఉందని తెరవెనుక ఎవరు ఉన్నారు బిజెపి త్వరలో బయ టపడుతుందన్నారు. మహిళలకు హామీ ఇచ్చిన 2500 పెన్షన్ ఏమైంది అన్నారు.
రైతులకు రుణమాఫీ కాలేదని రైతు పెట్టుబడి సాయం అందడం లేదని పండిన పంటకు డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం వద్ద లేకపోవడం సిగ్గుచేటు అన్నారు కార్మికులను రైతులను మహిళలను ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులకు ప్రజలు నిలదీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






