దేశ భక్తి, సేవాభావం అలవర్చుకోవాలి
సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : విద్యార్థి దశ నుండే దేశ భక్తి, సేవాభావం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో బాగంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా NCC క్యాడెట్లకు కలెక్టర్ చొక్కాకు స్టిక్కర్లు అతికించగా, కలెక్టర్ తన వంతు విరాళాలన్నీ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహాయార్థం ఎన్.సి.సి క్యాడేట్స్ ఎక్కువ మొత్తం లో విరాళాలు సేకరించాలని సూచించారు.
శత్రు దేశాల నుండి రక్షణన కల్పిస్తున్న మన సైనికులకు ఎంత విరాళాలు అందజేసిన తక్కువేనని, ప్రజలందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని భాగస్వాములు కావాలనీ పిలుపునిచ్చారు. 5 ఎన్.సి.సి క్యాడేట్ బృందాలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలు, అనుభంద సంస్థలు, దుకాణాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో పౌరుల చొక్కాలకు స్టిక్కర్లు అతికించి విరాళాలు సేకరించి, సైనిక సంక్షేమ సహాయ నిధి ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు.
దాతలు తరువాత రోజులలో సైతం డి.డి. లేదా చెక్కు ద్వారా ‘డైరెక్టర్, సైనిక వెల్ఫేర్, హైదరాబాద్-82,‘ పేరున జమచేయవచ్చని తెలిపారు. 80G (s) (vi) సెక్షన్ 1961 ఆదాయ చట్టం ప్రకారం సహాయ నిధి మొత్తానికి పన్ను మినహయింపు ఉందనీ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమా ఇంచార్జీ అధికారి స్రవంతి, మాజీ సైనికులు శంకర్ దాస్, దేవన్న, అశోక్, ఎస్.సి.సి. క్యాడేట్స్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






