22 May, 2026 | 2:04 AM

దొరల గడీలో ఊడిగం బంద్‌చేయి

22-05-2026 12:29 AM

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ప్రభుత్వ విప్ వీరేశం మండిపాటు   

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : ప్రజాస్వామికంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కనిపించడం లేదా..? అని ప్రభుత్వ విప్ వేమల వీరేశం అన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడిగా  ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నాయకత్వంపైన, శాంతిభద్రతలపై మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గురువారం ఆ యన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ధర్నా చౌక్‌ను పునరుద్దరించి నిరసనలు తెలిపే వాతావరణం కల్పించామనే విషయం గు ర్తుంచుకోవాలన్నారు. బండి భగీరథ్ కేసులో ఎఫ్‌ఐఆర్ తర్వాతే బీఆర్‌ఎస్ ఈ అంశంపైన మాట్లాడిందని దుయ్యబట్టారు.