30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

బీఆర్‌ఎస్ నేతలపై వేధింపులు మానుకోండి

05-04-2025 01:43 AM

‘ఎక్స్’ లో హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 4, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై వేధింపులు మానుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు హితవు పలికారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.

నల్లగొండ జిల్లా  మర్తినేనిగూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారని, ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. అక్రమ కేసులు ఉపసంహారించుకోవాలని హరీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.