వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 95 బంతుల్లో 171 రన్స్
అండర్ 19 ఆసియాకప్
భారత్ జట్టు ఘనవిజయం
దుబాయి, డిసెంబర్ 12 : భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. అండర్ 19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. దుబాయి వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 56 బంతుల్లోనే శతక్కొ ట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.ఈ యువ సంచలనాన్ని ఆపలేక ప్రత్యర్థి బౌల ర్లు తల పట్టుకున్నారు. ఈ క్రమంలో రెండో యూత్ వన్డే సెంచరీని సాధించాడు. సెంచరీ తర్వాత సైతం చెలరేగిపోవడంతో డబుల్ సెంచరీ బాదేలా కనిపించాడు. చివరికి 95 బంతుల్లో 171 ( 14 సిక్సర్ల్లు, 9 ఫోర్లు) పరుగులకు ఔటయ్యాడు. వైభవ్‌తో పాటు ఆరో న్ జార్జ్ (69). విహాన్ మల్హోత్రా(69), వేదాంత్ త్రివేది(38), అభిగ్యాన్ కుందు(32) కూడా రాణించడంతో భారత్ అండర్ 19 జట్టు 50 ఓవర్లలో 433 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. రెండో వికెటకు ఆరోన్ జార్జ్‌తో కలిసి వైభవ్ 221 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో పలు అరుదైన రికా ర్డులను అందుకున్నాడు. అండర్ వన్డే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (14) కొట్టిన ఆటగాడిగా వరల్డ్ రికా ర్డు నెలకొల్పాడు. తద్వారా 2008లో నమీబియాపై ఆసీస్ క్రికెటర్ మైకేల్ హిల్ 12 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును 17 ఏళ్ల తర్వాత వైభవ్ బద్దలుకొట్టాడు.అలాగే అం డర్ 19 ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గానూ నిలిచాడు. ఇదిలా ఉంటే ఛేజింగ్‌లో యూఏఈ 7 వికెట్లకు 199 పరుగులే చేయగలిగింది. ఉద్దిశ్ సురి(78), పథ్వి మధు(50) పర్వాలేదనిపించారు. దీంతో భారత్ 234 పరుగుల రికార్డు స్కోరుతో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ టోర్నీ తర్వాతి మ్యాచ్‌లో భారత్ అండర్ 19 జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుంది.




