calender_icon.png 19 October, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడబ్ల్యూఎస్ పై దుష్ప్రచారాన్ని ఆపాలి

19-10-2025 06:33:31 PM

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకై ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి..

ఆర్యవైశ్య నాయకుడు తాటిపల్లి రవీందర్ గుప్తా..

హనుమకొండ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న రాజ్యాంగబద్దమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయంగా జరుగుతున్న కుట్రను సాగనివ్వబోమని ఓసి జేఏసీ జిల్లా స్థాయి సదస్సులో తాటిపల్లి రవీందర్ అన్నారు. ఓసి జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో అగ్రకుల పేదల ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సు ఆదివారం బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ స్థల దాత, ఆలయ ధర్మకర్త, తాటిపల్లి రవీందర్ గుప్త మాట్లాడుతూ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, కమ్మ కులాల ప్రజలతో సుమారు 500 మంది సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రధానంగా ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉద్యోగ, వైద్యం రంగాలలో అగ్రవర్ణాలకు గుర్తించబడేటువంటి ఆరు కులాల విద్యార్థులందరికీ కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, వారి జనాభా 20% మించింది కనుక 20% రిజర్వేషన్లు ఆయా జాతులకు రిజర్వేషన్ కేటాయించాలని, తాము ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరికి అనుకూలం కూడా కాదు. మేము ఎంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించాలని మాకు ఉన్న డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

సింగిరికొండ మాధవ శంకర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలనీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ కోటాను గనుక సరిగా అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని, అగ్రవర్ణ పేద విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, వైద్య రంగాలలో 20% రిజర్వేషన్లు పెంచాలన్నారు. మేమెంతో మాకంతా నినాదంతో డిసెంబర్లో నిర్వహించబోయే సదస్సుకు ఆర్యవైశ్య కులస్తులను చైతన్య పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి వెంకటేశ్వరరావు, గోపు జయపాల్ రెడ్డి, సంజీవరెడ్డి, సమ్మిరెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుండా ప్రభాకర్ గుప్త, అరవింద్ బాబు, ఓమా ముక్తేశ్వర్ గుప్త, వంగపల్లి అంజయ్య గుప్తా, పూర్ణ సంతోష్ గుప్త, చిట్టిమల్ల శ్రీనివాస్ గుప్త, రాజన్న గుప్త, బజ్జూరి శ్రావణ్, తోట బాల భాస్కర్ గుప్త, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, డిటి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి, చల్ల రాజిరెడ్డి, పోలాడి రామారావు, తదితరులు పాల్గొన్నారు.