19-10-2025 06:36:02 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో ఆదివారం మాస శివరాత్రి (ధన త్రయోదశి) సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకీ సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు కుబేర స్వామి పూజ, మహాదేవునికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం, 108 తామర పుష్పాలతో ఘనంగా పూజ చేయడం జరిగింది. పూజారి వల్లకొండ మఠం మహేష్, రమేష్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ భూమయ్య దంపతులు, కొమురవెల్లి రవీందర్ దంపతులు, భక్త బృందం పాల్గొన్నారు.