12 June, 2026 | 3:06 AM

గ్రామ స్థాయి కమిటీల ద్వారానే పార్టీ బలోపేతం

12-06-2026 01:57 AM

నియోజకవర్గ ఇన్చార్జ్ రావులపల్లి రాంప్రసాద్

రావులపల్లిని ఘనంగా సన్మానించిన బీఆర్‌ఎస్ మండల కమిటి

భద్రాచలం, జూన్ 11 (విజయక్రాంతి): కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సభ్యత్వ నమోదు విజయవంతంగా చేపట్టడం తో పాటు గ్రామ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయడం కోసం గ్రామ కమిటీల నిర్మాణం తోనే సాధ్యమవుతుందని నియోజక వర్గ బాధ్యులు రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు.

గురువారం లక్ష్మీనగరంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి,అభివృద్ధి పథంలో తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ నడిపించి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు.

కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలు  నమ్మి కెసిఆర్ ని ఓడించి ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఇప్పుడు ఎన్నికలు జరిగితే  మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి కారు గుర్తు పై ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని,ఆదిశగా ప్రతీకార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసేదంట్లో బాగంగా గ్రామస్థాయిలో పార్టీ ని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయిలో పనిచేసేవారికి బాధ్యులుగా నియామకం చేయాలని,మహిళలకు ప్రాధాన్యత నివ్వాలని కోరారు.

కేంద్ర బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదును నిఖ్సాన పార్టీ సభ్యులకు అందించాలని పిలుపు నిచ్చారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజక వర్గ నాయకులు మానె.రామకృష్ణ మాట్లాడుతూ ‘తెలంగాణా ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పాలకులు తమ సంపాదనే ద్యేయంగా దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని,ప్రజల సంక్షేమం గాలికి వదిలేశారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేసు లక్ష్మీ, మండల కన్వీనర్ కణితి.రాముడు,కో కన్వీనర్ ఎండి. జానీ పాషా,నాయకులు అపక.వీర్రాజు,కొత్తూరు. సీతారామారావు, తునికి కామేష్, రావులపల్లిపృధ్వీ, దామెర్ల శ్రీనివాస్, తంతరపల్లి.వెంకటేశ్వర్లు, లంక.శివ, పిఎసిఎస్ డైరెక్టర్ లు బొల్లి వెంకటరావు, కాలువ.పూర్ణయ్య, పీసోడీ వెంకటేష్, సర్పంచ్ లు వాగఖాదర్ బాబు, మడకం జోగయ్య, నాయకులు, భూక్యా చందు, కాటిబోయిన వెంకటేశ్వర్లు, శ్రీను, కుంజా నాగేశ్వరావు, వాగే కృష్ణ, పాయం బాలు కుమారీకుంట్ల సూర్య,గోసంగి కిరణ్, అపకా వెంకటేష్, మర్మం గంగరాజు సోయం నర్సింహారావు, జంగిటి రాము, జిలకర గంగరాజు,పూసం రాజేష్, మడకం భూపతి, శ్యామల వెంకటేష్,శీలం చలపతి, కొండ్రు నర్సింహారావు యానబోయిన కోటి, రాము, రమేష్, మట్ట సమ్మక్క, పూనెం కవిత  నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.