కేంద్ర పథకాలు అమలు చేయాలి
ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
హైదరాబాద్, జూన్ 11 (విజయకాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు తెలంగాణలో అమలు కావడం లేద ని, వాటిని అమలు చేసేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను కోరారు.
ఈ మేరకు గురువారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను ఆయన కలిసి ప్రత్యేకం గా విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్షా బీమాయోజన, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు సహా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దాదాపు 22 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో సరిగా అమలు చేయడం లేద ని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అతివృష్ఠి, అనావృష్ఠి సహా ప్రకృతి వైపరీత్యాలకు పంట నాశనమైతే రైతులకు పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్‌బీమా యోజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని, తద్వారా అన్నదాతలకు నష్టం జరుగుతోందని గవర్నర్‌కు వివరించారు. కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో పకడ్భందీగా అమలు చేసేలా ప్రభు త్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.






