సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం
జవహర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా: కాప్రా తాసిల్దార్ మతిన్
జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు భూముల పరిరక్షయే ధ్యేయంగా పనిచేస్తామని జవహర్ నగర్ లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కబ్జాదారులపై ప్రత్యేక నజరు పెడుతున్నామని కాప్రా తాసిల్దార్ మతిన్ హెచ్చరించారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు శనివారం గిరధవార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను కాపాడుతామని పేద ప్రజలు ప్రభుత్వ భూములు కొని మోసపోవద్దని సూచించారు. వికలాంగుల కాలనీ, మోహన్ రావు కాలనీ, సంతోష్ నగర్ ,డెంటల్ కాలేజీ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






