calender_icon.png 29 July, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు

29-07-2025 01:06:07 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జూలై ౨౮ (విజయక్రాంతి):నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు, సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, రసీదు పుస్తకాలు తదితరాలను పరిశీలించా రు. వానాకాలం సాగు సమయంలో రైతులకు ఎరువులు,

విత్తనాల అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులను మోసం చేసే చర్యలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. గడువు ముగిసిన, నాణ్యతలేని ఎరువులు లేదా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత విక్రేతలపై కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసా య అధికారి అంజి ప్రసాద్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.