14 March, 2026 | 10:51 PM

16న ప్రజావాణి కార్యక్రమం రద్దు

14-03-2026 07:30 PM

గద్వాల: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 16న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు ఐడిఓసిలో జనాభా గణనపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం గురించి ప్రజలకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుందని, ఇట్టి విషయం గుర్తించి ప్రజలు అసౌకర్యానికి గురి కాకూదని తెలిపారు.