calender_icon.png 29 July, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

29-07-2025 01:07:15 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం అసిఫాబాద్, జూలై ౨౮ (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ ,అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాలను మంజూరు చేస్తుందని వాటిని సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను సందర్శించారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని. ఎరువులను పక్కదా రి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మోహినుద్దీన్, ఏ డి ఏ మనోహర్, మండల వ్యవసాయ అధికారి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.