calender_icon.png 29 July, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు ఇంజక్షన్లు సరఫరా ముఠా అరెస్టు

29-07-2025 01:04:54 AM

ఏఎస్పీ రాజేష్ మీనా

నిర్మల్, జూలై 28 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో యువత మత్తుకు బానిస కావడంతో వారి అవసరాలను ఆసరా చేసుకుని అందుకు నిషేధిత గుట్కా లైసెన్స్ లేని మత్తు ఇంజక్షన్లు గంజాయిని విక్రయిస్తున్న ముఠా సభ్యులను సోమవారం అరెస్టు చేసినట్టు జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు ఏఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

నిర్మల్ పట్టణం చెందిన షేక్ మతీం మహమ్మద్ పర్వేజ్ షేక్ సోనోమన్ అనే నలుగురు యువకులు నిర్మల్ పట్టణంలో గంజాయితోపాటు రోగులకు వినియోగించే మత్తు ఇంజక్షన్ కొనుగోలు చేసి నిషా కోసం ఇతరులకు వికరిస్తున్నట్టు తెలిపారు. ఆపరేషన్ల సమయంలో వినియోగించే మిఠాపిన్ టర్మాటిక్ సల్ఫేట్ ఇండక్షన్ లైసెన్స్ లేకుండా కొనుగోలు చేసి మత్తు పదార్థాలకు బానిసైనా యువకులకు ఇంజక్షన్ల రూపంలో సర ఫరా చేస్తున్నట్లు విచారణ తేలింది అన్నారు.

పోలీసులకు సమాచారం రావడంతో వారిని అదుపులో తీసుకొని విచారించగా నేరం కూడా జరిగిందని వారి వద్ద నుంచి మూడు మత్తు ఇంజక్షన్లు మూడు సీరేంజరులు 100 గ్రాముల గంజాయి ఒక ఆటో నాలుగు ఫోన్లు స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు మత్తు పదార్థాలు ఇంజక్షన్లపై పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిఘా పెట్టడం వలన ముఠా సభ్యులను గా పట్టుకోవడం జరిగిందని ఆయన వివరించారు. 

మత్తుకు  బానిసైన ముగ్గురు వ్యక్తులు మియాజుద్దీన్ రాజశేఖర్ గణేష్ లను బైండోవర్ చేసినట్టు ఆయన వివరించారు. మత్తు ఇంజక్షన్లతో వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు ఈ సమావేశంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీ సులు పాల్గొన్నారు