calender_icon.png 17 November, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేకుండా పంట కొనుగోలు చేపడితే కఠిన చర్యలు..

17-11-2025 05:56:02 PM

తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్

బోథ్ (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో అనుమతులు లేకుండా మొక్క జొన్న, పత్తి, సోయబిన్ కొనుగోలు చేస్తున్న గోపాల్ అనే వ్యక్తి షాపును తనిఖీ చేసి 58 బస్తాలు మక్కలు 60 కిలోల పత్తిని సీజ్ చేసి సెక్రటరీ AMC బోథ్ కు అప్పగించినట్లు తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా పంటల కొనుగోలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు. పంటల అమ్మకం కొనుగోలు చేయడానికి ట్రేడింగ్ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ, ఏఎంసి సెక్రటరీ ఉన్నారు.