calender_icon.png 17 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలి

17-11-2025 06:03:30 PM

ఎంఈఓ మల్లేశం, మాదారం ఎస్సై సౌజన్య

తాండూర్, (విజయక్రాంతి): విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకొని ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని మండల విద్యాధికారి మల్లేశం, మాదారం ఎస్సై సౌజన్యలు అన్నారు. సోమవారం మండల స్థాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని వ్యాసరచన ఉపన్యాస పోటీలను నారీ యువశక్తి ఫోరం ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఝాన్సీ లక్ష్మీబాయిని విద్యార్థినులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆధునిక భారతదేశంలో మహిళల పాత్ర అనే అంశం మీద ఉపన్యాసం, డిజిటల్ యుగంలో మహిళా రక్షణ అనే అంశం మీద వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మండలంలోని అన్ని పాఠశాలల నుండి సుమారు 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అచులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయరావు, బిజెపి సీనియర్ నాయకులు పులగం తిరుపతి, బిదూడపాక భరత్ కుమార్, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు సుమన చైతన్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.