8 June, 2026 | 11:04 PM

డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచన

08-06-2026 09:57 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం సమాజ బాధ్యత అని తెలిపారు.

విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. వంకేశ్వరం గ్రామంలో గంజాయి మొక్కలు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.