8 June, 2026 | 11:03 PM

సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య

08-06-2026 09:59 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఉప సర్పంచ్ వజ్జె చిన్నరవి అన్నారు.మండలంలోని అడివెంల గ్రామంలో ఎంపీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి తమ చిన్నారులను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొర్ర నాగరాజు, హెచ్ఎం యాదమ్మ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, కరుణ, తల్లిదండ్రులు రహీం, బీబమ్మ, శ్రావణి, శైలజ, మాధవి, అనూష, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.