30 June, 2026 | 11:01 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మహిళల ఆర్థిక సాధికారతకు కృషి

08-05-2026 12:00 AM

స్వయం సహాయక బృందాలకు రుణాల పరిమితి పెంపు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా కృషి చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు అందిస్తున్న రూ.5 లక్షల రుణాల పరి మితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. గురువారం ప్రజాభవన్‌లో నిర్వహించిన స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026 ఆవిష్కరణలోపాల్గొని మాట్లాడారు. 

ఈ ఏడాది రూ.26,621.47 కోట్ల రుణాలు ఇవ్వాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2025  రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళా సంఘాలు రుణాల రీపేమెంట్లో అద్భుతమైన క్రమశిక్షణ చూపిస్తున్నాయని,  నిర్మల్ జిల్లా జీరో ఎన్‌పీఏ సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను అభినందించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు.