30 June, 2026 | 10:11 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇందిరమ్మలో నల్లగొండ ఆదర్శంగా నిలవాలి

08-05-2026 12:00 AM
  1. అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ న్యాయం చేయాలి 
  2. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలవాలని నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. పభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాల్లో శాశ్వత మార్పుకు దారితీస్తున్నాయన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి విడత బిల్లులు పొందిన లబ్ధిదారులకు తదుపరి బిల్లులు కూడా ఆలస్యం లేకుండా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించాలని మంత్రి సూచించారు.

గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు వేగంగా పరిష్కారమవుతా యన్నారు. విద్య, ఉపాధి, గృహభద్రత అనేవి పేద కుటుంబ భవిష్యత్తును మార్చగలవని, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ముం దుకు సాగుతోందన్నారు. భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అర్హులకే లబ్ధి చేకూరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.