27 February, 2026 | 6:42 PM

చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో ఉపాధికై పోరాటం

27-02-2026 05:00 PM

- కేయూ జేఏసీ అధ్యక్షులు డి.తిరుపతి

హనుమకొండ,(విజయక్రాంతి): దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసే ప్రాణాలు అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో విద్యార్థి, యువత ఉపాధి కోసం ఉద్యమించాలని కేయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు డి.తిరుపతి పిలుపునిచ్చారు. శుక్రవారం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని యూనివర్సిటీ క్యాంపస్ లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జేఏసీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ... నాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే పోరాటం చేసి ప్రాణాలర్పించిన ఆజాద్ స్ఫూర్తి చిరస్మరణీయమని, భగత్ సింగ్ కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేయడం కోసం నాడు ప్రజలందరినీ ఒక తాటి మీదికి తీసుకురావడం కోసం ఎంతగానో శ్రమించాడు.

అనేక నిర్బంధాలను ఎదుర్కొని దేశం కోసం పోరాడిన ప్రాణాలర్పించిన విప్లవ వీర కిశోరం చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో నేటి యువత సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మతం, కులం పేరుతో జరుగుతున్న ఉన్మాదాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ కార్యదర్శి జనగాం రాజారాం, నాయకులు బొక్క ప్రవర్ధన్, కే. సతీష్,ఎస్కే పాషా, డోనాల్డ్,  ఎం.నాగేశ్వరరావు, పాల్గొన్నారు.