24 July, 2026 | 7:06 PM

బీసీల హక్కుల కోసం పోరాటం

24-07-2026 06:35 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జనాభాలో సగానికి పైగా ఉన్న బీ.సీ ల హక్కుల కోసం పోరాటం చేద్దామని బీసీ కులాల  సామాజికవేత్త పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం బీసీ కులాల కరపత్రిక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ అన్ని కుల సంఘాలు ఒకే తాటిపై వచ్చి సమరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు దత్తాత్రేయ నరేష్,సంతోష్,రమేష్, శేఖర్, ఇటిక్యాల నరేష్ వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.