calender_icon.png 1 November, 2024 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటకెక్కిన ‘అరచేతిలో ఆరోగ్యం’!

20-04-2024 12:25:00 AM

l హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్‌గా సిరిసిల్ల, ములుగు  

l జిల్లాలో 3.47 లక్షల మందికి హెల్త్ ప్రొఫైల్ పూర్తి

l వేములవాడలో ప్రారంభించిన అప్పటి మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): అరచేతిలోనే పూర్తి డిజిటల్ ఆరోగ్య సమాచారం కోసమంటూ గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం హెల్త్ ప్రోఫైల్.  రెండు సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అప్పటి మంత్రి కే తారక రామారావు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇంటింటికి వైద్యబృందాలను పంపించి పలు పరీక్షలు చేసి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. తమకు కేటాయించిన ఈహెల్త్ ప్రొఫైల్  ఆన్‌లైన్ లో నిక్షిప్తం చేశారు.

రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టులు గా తీసుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఆ పథకం ముందుకు సాగకపోవడంతో అటకెక్కినట్టేనా అన్న చర్చ జరుగుతున్నది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. గతంలో చేసిన హెల్త్ ప్రొఫైల్ వివరాలను వాడుకుంటారా.. మళ్లీ సర్వే చేయిస్తారో వేచి చూడాల్సి ఉంది.

జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్

2022 మార్చి 5న వేములవాడలో కేటీఆర్ వేములవాడ వంద పడకల దవాఖా నలో ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని ఆరోగ్య సిబ్బంది జిల్లాలోని ఇంటింటికి తిరిగి వివరా లు సేకరించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే  గుర్తించడం, రక్తహీనతకు తగి న వైద్యం అందించడం, ఆన్‌లైన్‌లో సమగ్రంగా నమోదు చేయడం ప్రధాన లక్ష్యంగా సిబ్బంది పని చేశారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలు సేకరించి 30 రకాల పరీక్షలు నిర్వహించారు. వారికి ఆరో గ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫై ల్) కార్డులను సిద్ధం చేసేందుకు పరీక్షలు చేశారు. ఇందుకోసం సిరిసిల్ల ఏరియా దవాఖానలో రక్త నమూనాలను పరీక్షించేందుకు టీ డయోగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.27 కోట్లతో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ మోడ్‌లో వేగవంతంగా ఇంటింటా తిరిగి నమూనాలు సేకరించారు. షుగర్, బీపీ, రక్తపరీక్షలు తదితర 30 రకాల పరీక్షలు చేశారు. అవసరమున్నవారికి ఇంటివద్ద, మరికొందరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందించారు. 

రాజన్న సిరిసిల్లలో 

హెల్త్ ప్రొఫైల్ వివరాలు

సర్వే చేసిన బృందాలు: 203

గ్రామాలు: 255

మున్సిపాలిటీలు: 02

ప్రభుత్వ దవాఖానలు : 18

సర్వే పూర్తయినవారు : 3,47,565