21-02-2026 01:00:38 AM
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 20: రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎంపిటిసి - జడ్పిటిసి ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెట్టకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని, బీసీలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని హెచ్చరించారు.
బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా పాత పద్ధతిలో 17% తగ్గించి ఎన్నికలకు పోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. రాష్ట్రంలో బీసీల తిరుగు బాటు యుద్ధం జరుగుతుందని14 బి.సి సంఘాలు హెచ్చరించాయి. బి.సి ఉద్యమం పల్లె పల్లెకు వెళ్ళి ప్రజా ఉద్యమంగా మారిందని దీనిని ఎవరు అడ్డుకోలేరన్నారు. కోర్టులో కేసు 100% బీసీల పక్షాన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్దంగానే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం నాయకులు మేడబోయిన సాయికుమార్ , అనంత్ నాగరాజుగౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, గుండ్ర గణేష్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.