11-02-2026 01:29:48 AM
నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా
హనుమకొండ, ఫిబ్రవరి 10( విజయ క్రాంతి): మడికొండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల వసతి గృహం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి కులగజ్జి తో 12 మంది విద్యార్థులను కిందపడేసి చితక బాధడంతో ఈరోజు విద్యార్థులందరూ కలిసి గేటు తోచుకొని వరంగల్ నుంచి హై దరాబాద్ వెళ్లే దారి మార్గం పై బైఠాయించి ప్రిన్సిపాల్ ని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
విద్యార్థులు సివిల్ డ్రెస్ వేసుకున్న కూడా వారిని అ పార్థంగా మాట్లాడుతూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపల్ ను వెంటనే వీధి నుంచి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులను నానారకాలుగా హింసిస్తూ, గత కొద్ది రోజుల నుంచి విద్యార్థినీలను మానసికంగా, శారీరకంగా, భౌతికంగా దాడి చేస్తున్న ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి ని వి ధుల నుంచి తొలగించాలని సారోస్ జిల్లా అధ్యక్షుడు ఎల్కుర్తి సాయికుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు అండగా స్వేరోస్ బృందం ఉంటుందని, స్వేరోస్ రాష్ట్ర నాయకులు మారేపల్లి మనోజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. మడికొండ పోలీసులు విద్యార్థినీలను సముదాయించి కళాశాల్లోకి పంపించారు.