calender_icon.png 11 February, 2026 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన వంగర సర్పంచ్

11-02-2026 01:28:20 AM

గజ్జల సృజన రమేష్

భీమదేవరపల్లి ,ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరప ల్లి మండలంవంగర గ్రామంలో కేంద్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను గ్రా మ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జల సృజన రమేష్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలు, కూలీలకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకమని తెలిపారు.

గ్రామంలోని ప్రతి అర్హుడైన ఉపాధి కూలీకి పని దొరికేలా చర్యలు తీసుకుంటామని, వంద రోజుల ఉ పాధి లక్ష్యాన్ని చేరుకునేలా గ్రామపంచాయతీ కృషి చేస్తుందని అన్నారు.గ్రామ అభివృద్ధితో పా టు కూలీల జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ పనులు ప్రారంభించామని, పనుల అ మలులో పారదర్శకత, నాణ్యత, వేగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వల్లాల రమేష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.