15 June, 2026 | 11:09 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రోడ్డు బాగుచేయాలని విద్యార్థుల ధర్నా

18-02-2026 12:00 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 17: జిల్లాలోని నాగారం మండలంలోగల పస్తాల గ్రామానికి వెళ్లే రోడ్డు గడచిన పది సంవత్సరాలుగా బాగాలేక గ్రామస్థులు, వాహన దారులు, విద్యార్ధులు నానవస్థలు పడుతున్నారు,

అయినా కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్ధులు మంగళవారం రోడ్డు పై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోడ్డుపై కంకర తేలి, లోతైన గుంతలు పడ్డాయన్నారు, గతంలో నేతలు ఇచ్చిన హామీలు, చేసిన శంకుస్థాపనలు కూడా శిధిలావస్థకు చేరాయని విమర్శించారు. మాకు పదిరోజుల్లో సమాధానం రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తామని విద్యార్ధులు హెచ్చరించారు.

మా గ్రామానికి ప్రధాన సమస్య అయిన ఈ రోడ్డును త్వరగా పూర్తిచేసి న్యాయం చేయాలని  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అలాగే కలెక్టర్ అభ్యర్ధిస్తున్నట్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.