విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
సర్పంచ్ కృష్ణనాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 3: బాల్యం నుంచే విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా క్రీడలు,కళలు,సాంకేతిక రంగాల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ అన్నారు.మండల పరిధిలోని సూర్యానాయక్ తండా ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు.
అనంతరం జరిగిన బాలల గ్రామసభలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని సూచించారు.తదనంతరం పాఠశాల పరిసరాలను,మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కైరంకొండ రమేష్,సహోపాధ్యా యుడు లింగయ్య,వార్డు సభ్యులు నరసింహ,బిక్కునాయక్,బుజ్జిభద్రు నాయక్, ఆంగోతు నర్సింహా,వీరన్న నాయక్,వెంకటేష్,శిరీష, ఆశాలు,వీబీకేలు,మహిళా సంఘం సభ్యులు,గ్రామస్తులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






