calender_icon.png 12 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

12-02-2026 12:47:22 PM

ప్రైవేటు పాఠశాల వార్షిక ఆటల పోటీల ప్రారంభోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని, మహాదేవపూర్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Srinu Babu) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ప్రైవేటు పాఠశాల వార్షిక ఆటల పోటీలను  శ్రీనుబాబు గురువారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు ఆటోల్లో కూడా రాణించాలని కోరారు. ఆటల్లో రాణించి ఊరికి, పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు,  పాఠశాల కరెస్పాండెంట్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.