7 April, 2026 | 3:44 PM

విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి

07-04-2026 02:11 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని ఎంజేబీ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి , జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించడం చాలా ముఖ్యమని తెలిపారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ తాగునీటి శుద్ధి కేంద్రం ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా అటవీ శాఖ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ స్వాతి,  అటవీ శాఖ అధికారులు గోవింద్ చంద్ సర్దార్, యోగేష్ కులకర్ణి, మహేందర్, రాజేష్, వెంకటేశ్వర్ తదితర అధికారులు , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.