22 July, 2026 | 10:57 AM

వరద రానిచోట అంచనాలకు మించి కల్వర్టుల నిర్మాణం

22-07-2026 10:26 AM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది నిర్మించిన పలు గ్రామాలలో కల్వర్టులో వరద ఉధృతిని గుర్తించకుండానే నిర్మాణాలు చేపట్టారు. అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నిర్మించిన కల్వర్టులు అనేక గ్రామాలు ముందు చూపు లేకుండా నిర్మాణాలు జరిగాయి. కొన్ని గ్రామాలలో కేవలం గుత్తేదారుల స్వలాభం కోసం నిర్మించినట్టుగా ఉన్నాయని పరిశీలన విమర్శిస్తున్నారు. కల్వర్టుల నిర్మాణం తోపాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న సమయంలో కొంతమంది ఇంజనీర్ లకు సమాచారం ఇవ్వకుండానే పనులు చేపడుతున్నారు దీంతో పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు ఇష్టానుసారంగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ఫలితంగా పనుల పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. పనులు పూర్తి అయిన తర్వాత అధికారులు వచ్చి చూసి పనులు చేపట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అంతేగాక పనుల్లో నాణ్యత లోపం ఉంటే ఎం బి రికార్డులను నిలిపివేస్తున్నట్లు తెలిసింది. అనేక అభివృద్ధి పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేయడంతో అధికారులు ఎంపీ రికార్డుల్లో కోత విధిస్తున్నట్లు పనులు చేపట్టిన వారు ఆపోతున్నారు... 

రాజకీయ నాయకులు బుద్ధిదారులు

పలు గ్రామాలలో అభివృద్ధి పనులు అధికార ప్రతిపక్ష పార్టీల వారు చేపడుతున్నారు.  ఎంబి రికార్డుల్లో ఇంజనీరింగ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. కొంతమంది నాయకులు ఒక అడుగు ముందుకు వేసి గతంలో పనిచేసిన ఇంజనీరింగ్ అధికారులతో రికార్డులు చేయిస్తున్నట్లు సమాచారం.

పనుల్లో నాణ్యత లేకుంటే ఎంబి రికార్డులు చేయడం లేదు

అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుంటే పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు చేయడం లేదని డి ఈ రాజేష్ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు మామూలేనని తమ ఉద్యోగాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు.. పనుల్లో నాణ్యత లేకపోతే రికవరీ సహితం విధిస్తారని ఆయన తెలిపారు.