చదువుతోబంగారు భవిష్యత్తు
- విద్యార్థులకు సైకిళ్లు షూ పంపిణీ
- మీ ఎదుగుదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా
- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
- మీ సహకారం మరువలేమన్న విద్యార్థులు
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : చదువుతోనే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు లభిస్తుంది దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA G. Madhusudan Reddy) అన్నారు. బుధవారం చిన్నచింతకుంట మండల పరిధిలోని దమగ్న పూర్ గ్రామంలో వడ్డేమాన్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ ఉంచి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కాలినడకతో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేందుకు విద్యార్థులకు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని సైకిళ్లు షూ పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాలినడకతో పాఠశాలకు వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే పలుమార్లు తమను చూశారని తమ ఆవేదనను చూసి సైకిళ్ళు షోలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థినిలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.






