కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు
10-12-2024 04:23 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు కరాటే పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచారు. కాగజ్ నగర్ లో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సైదం శైలజ, అక్షయ, మేఘనలు గోల్డ్ మెడల్ సాధించగా అంజలి, తేజ రాణి, రచన శ్రీ, ప్రశంస, నందిని, అభినయ, సిల్వర్ పథకాలను సాధించారు. కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలను పాఠశాల ప్రిన్సిపాల్ రత్న బాయ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.






